జస్ట్ ఫర్ ఫన్

పెళ్ళైన ఆడవాళ్ళ సమావేశం జరుగుతుంది. సమావేశ నిర్వాహకురాలు అక్కడికి వచ్చిన వాళ్లందరిని ఓ ప్రశ్న అడిగింది. 'మీరు మీ భర్తకు ఐ లవ్ యు అని చివరిసారిగా ఎప్పుడు చెప్పారు?' అని. ఈ రోజు చెప్పాను అని ఒకరు, రెండు రోజుల క్రితం అని ఇంకొకరు, వారం క్రితమని మరొకరు చెప్పారు. 'సరే ఇప్పుడు మీ ఫోన్ తీసుకొని మీరంతా మీ మీ భర్తలకు 'I LOVE YOU అని పంపండి. ఎవరికైతే 'Awesome answer" వస్తుందో.. వారికి ఒక Surprise GIFT అని చెప్పింది. అక్కడ ఉన్న వారంతా వాళ్ళ భర్తలకు 'I LOVE YOU అని మెసేజ్ పంపించారు. కొంత సేపటి తరువాత వాళ్ళ భర్తల రిప్లై ఇలా ఉంది. 1. స్వీటీ నీ కండీషన్ ఓకే కదా? 2. ఈ రోజు మళ్ళీ వంట చెయ్యలేదా? 3. డార్లింగ్,ఇంటి ఖర్చులకు ఇచ్చిన మనీ అయిపోయిందా? 4. ఏంటి సంగతి? 5. నువ్వేమైనా కల కన్నావా? లేక నేను కంటున్నానా? 6. నువ్వెళ్ళిన ఫంక్షన్ లో ఎవరిదైనా జ్యువెలరీ నచ్చిందా? 7. ఆఫీస్ లో ఇంత టెన్షన్ లో ఉంటే ఈ టైంలో ఇలాంటి మెసేజెస్ పంపిస్తావు. నీ మైండ్ ఏమైనా దొబ్బిందా? 8. ఎన్ని సార్లు చెప్పాను ఆ ఏడుపుగొట్టు సీరియల్స్ చూడొద్దని? 9. ఓహొ.. మళ్ళీ యాక్సిడెంట్ చేశావా? 10. పిల్లాడిని ఇవ్వాళ కూడా నేనే స్కూల్ నుంచి తీసుకురావాలా? బహుమతి పొందిన మెసేజ్.. . . . 11. Who is this?

No comments:

Post a Comment

Show Emoticons