God, Dog, Monkey, Cow and Man Life Story

ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.. . దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి ముందు కూర్చో. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తాను. . కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని ఏళ్ళు అరవలెను. కాబట్టి ఇదుగో 10 ఏళ్ళు నీకు ఇచెస్తను. 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా ! . దేవుడు: సరే.. ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు. దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు. నీకు 20 ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను. . కోతి: ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా నేను అలాగే ఇస్తాను. . దేవుడు: సరే… మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు. దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ రైతుకి సహాయం చేయి. నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను. . ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను. నాకు కూడా 20 ఏళ్ళు ఇచి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… . దేవుడు: సరే… తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు. దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.. నేను నీఎకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తునాను. . మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10,10 మొత్తం 80 కావాలి… . దేవుడు: సరే… "అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు , ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు .. . తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు ఆ . తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు మనవరల్లని నవ్విస్తున్నాడు .. తరవాత . 10 ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….!

No comments:

Post a Comment

Show Emoticons